ఆగస్టు 09న ప్రతీ ఆదివాసీ గూడెల్లో ఆకుపచ్చ జెండా ఎగరేద్దాం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆగస్టు 09న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపధ్యంలో దమ్మపేట మండల పరిధిలో ప్రతీ ఆదివాసీ గ్రామం నుంచి ప్రతి ఇంటికి ఒకరు చొప్పున స్వచ్ఛందంగా మండల కేంద్రంలో చేరుకొని మన ఆదివాసీల ఐక్యతను చాటేలా భారీ ర్యాలీ నిర్వహిద్ధం,గోండు బొబ్బిలి కొమరం భీమ్,ఆదివాసీ సాయుధ పోరాట యోధులు మన్యం పులి సోయం గంగులు విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులు అర్పించి మన ఐక్యతను చాటడానికి ప్రతి ఒక్క ఆదివాసి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు,ఆగస్ట్ 9న భారీ ర్యాలీ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది, మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఆదివాసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ,తంబళ్ల రవి,వాసం పోలయ్య,సున్నం శ్రీను,ప్రసాద్,కారం రత్నకుమారి, కృష్ణవేణి,వాడే లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.