| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డ్ లో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డ్ లో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హౌసింగ్ బోర్డ్ లో కబ్జాదారుల నుండి  మున్సిపల్ కి సంబంధించిన ఖాళీ స్థలాన్ని కాపాడాలని నుడా చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. వినాయక్ నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించి రోడ్ నెంబర్ 1 లో కొందరు వ్యక్తులు కార్ల షెడ్డు నిర్మించి స్థలాన్ని కబ్జా చేసే కుట్ర పన్నుతున్నారని  ఫిర్యాదులో కాలనీ వాసులు పేర్కొన్నారు. గణేష్ మోటార్స్ కార్ల షెడ్డు నిర్మించడంతోపాటు, అక్కడ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలంగాణ న్యూ హౌసింగ్ రెసిడెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నుడా చైర్మన్ కేశవేణును బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. దాదాపు 2000 గజాల స్థలాన్ని కబ్జా చేశారని, దీనిపై తగు చర్యలు తీసుకొని స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని కోరారు. నుడా చైర్మన్ ను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, కార్యదర్శి బాల్ సింగ్ నాయక్ చౌవాన్, కోశాధికారి హనుమంతరావు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Previous అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ
Next ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ
ADVERTISEMENT