| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

డైలీ భారత్, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్ట్ ఈ వారెంట్ జారీ చేసింది. అయితే హుజురాబాద్ ఎన్నికల ప్రచార ఉల్లంఘన కేసులో కోర్టు ముందు హాజరవమని ఎన్నిసార్లు నోటీసులు పంపినా బండి సంజయ్ హాజరు కాకపోవడంతో, కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి, మరింత సమయం కోరుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తరపున న్యాయవాది రేపు కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చెయ్యనున్నారు. అలాగే ఈనెల ౩౦న కోర్టు ముందు హాజరయ్యేందుకు కూడా అనుమతి కోరనున్నారు

Previous పృద్వి అపార్ట్మెంట్లో ఆలస్యంగా వెలుగు చూసిన చోరీ ఘటన
Next శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు
ADVERTISEMENT