| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ దగ్గర శివారులోని 18 వ డివిజన్  పరిధిలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో అమ్మవారికి నిష్టగా భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉండకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి వారి మోక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Previous బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Next ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినందుకు భర్తను చంపిన భార్య
ADVERTISEMENT