| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పృద్వి అపార్ట్మెంట్లో ఆలస్యంగా వెలుగు చూసిన చోరీ ఘటన

పృద్వి అపార్ట్మెంట్లో ఆలస్యంగా వెలుగు చూసిన చోరీ ఘటన

పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం తో విచారణ

చోరీఘటన వివరాలు తెలపడానికి నిరాకరిస్తున్న అపార్ట్మెంట్ వాసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో ఉన్న పృధ్వి రెసిడెన్సి అపార్ట్మెంట్లో వారం రోజుల క్రితం జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపడుతున్నారు. అయితే అపార్ట్మెంట్లోని 114 ఫ్లాట్ లో అద్దెకు నివాసముండే ఓ ప్రభుత్వ ఉద్యోగురాలు వీకెండ్ కావడంతో శనివారం సాయంత్రం హైదరాబాద్లో  నివాసముండే తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ చోరీ ఘటనలో సుమారు నగదు రూపాయలతో పాటు బంగారు ఆభరణాలు కూడా సుమారు రెండు లక్షల వరకు చోరీ అయినట్లు బాధితురాలు తెలిపారు. అయితే నిజామాబాద్ లోని ప్రతిష్టమైన భద్రతగా పేరండిన ఈ అపార్ట్మెంట్లో చోరీ జరగడం వెనక ఓరి జరిగిన విషయం తెలపడానికి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ చూసే వారు ఏమి జరిగిందో ఎలా జరిగిందో చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. పైగా ఇలాంటి చోరీలు సహజమని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇంత భద్రత గల అపార్ట్మెంట్ అని పేరుగల ఈ అపార్ట్మెంట్లో గత 20 రోజుల నుండి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వాస్తవం తెలిసింది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయాన్ని పసిగట్టిన దుండగులు ఈ ఘాటుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

Previous పేకాట స్థావరంపై సుజాతనగర్ పోలీసుల దాడి
Next బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ADVERTISEMENT