| Daily భారత్
Logo




వివి నగర్ కాలనీ శ్రీ శివ సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

News

Posted on 2025-07-10 13:09:25

Share: Share


వివి నగర్ కాలనీ శ్రీ శివ సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ డివిజన్ పరిధిలో లక్ష్మీ ప్రియ నగర్ కాలనీ వివి నగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ సాయి బాబా ఆలయంలో గురువారం ఉదయం తెల్లవారుజామున నుండి గురుపౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైబావోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు రచ్చ సుదర్శనం ఇతర కమిటీ సభ్యులు ఆయనను సాదరంగ స్వాగతించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సుదర్శనం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ శివ సాయి బాబా ఆలయంలో భక్తుల కొంగుబంగారంగా నిలుస్తూ వస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ ఆలయంలో బాబాను దర్శించుకుని సమ సమస్యలను బాబాకు మనసులో కోరుకుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుందని భక్తులు గత కొన్నేళ్లుగా నమ్ముతూ వస్తున్నారని ఆయన అన్నారు. అందుకే కాలనీలో భక్తులు ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలను స్వచ్ఛందంగా వచ్చి ఇస్తూ ఉంటారని ఆయన అన్నారు. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని దీనికి కూడా భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందంటే బాబా మహిమ ఎలాంటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. దయచేసి హిందూ మహిళలు యువతులు గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా రావాలని అప్పుడే హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వారవుతామని అన్నారు. ఎందుకంటే కొంతమంది యువతులు గుడికి వచ్చిన కానీ చేతులకు గాజులు, స్పష్టంగా తిలకం బొట్టు కనబడే విధంగా రావాలని విజ్ఞప్తి చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ఓంకార్ పంతులు దంపతులకు ఆలయ కమిటీ వారు పాద పూజ చేశారు. అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వ్యాసముని జన్మదినం రోజున గురుపౌర్ణమి జరుపుకోవడం మన సాంప్రదాయమని ప్రతి ఒక్కరిపై  ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మహేష్ కుమార్, కోశాధికారి ఆనంద్ రావు, వైస్ ప్రెసిడెంట్ లు గంగదాసు, శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >