Posted on 2025-07-03 12:15:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ( ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎనిమిది మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
మల్టీ జోన్–1 పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలను జూన్ 23న ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మందికి స్థానచలనం కల్పించారు.
వెయింటింగ్‌లో ఉన్న సీఐ నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ పని చేస్తున్న తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్‌లో విధులు నిర్వహిస్తున్న కన్నం కుమారస్వామిని మధిరకు, కామారెడ్డి సీఎస్‌బీలో పనిచేస్తున్న తిరుపయ్యను బాన్సువాడ రూరల్‌కు పంపించారు. వెయిటింగ్లో ఉన్న ఆర్ బన్సీలాల్‌ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ సర్కిల్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తుపల్లి సీఐగా పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, మధిర సీఐ దొంగరి మధు, బాన్సువాడ సీఐ తోకల రాజేష్‌ను హైదరాబాద్‌లోని మల్టీజోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >