Posted on 2025-07-03 10:52:48
మైండ్ కేర్ సెంటర్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ పిలుపు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల మరియు జిల్లా వైద్య ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు మానసిక ఆరోగ్యంపై గ్రూప్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో న్యూరో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులకు కౌన్సిలింగ్, చికిత్స పద్దతులను గురించి వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాటడుతూ సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి అని అన్నారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కార మార్గాలపై దృష్టి నిలపాలని అన్నారు.
మద్యపాన వ్యసనం గురించి మాటాడుతూ దీనిపై కార్మికుల్లో అనేక అపోహలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో తనను సంప్రదిస్తే వైద్యం అందించి మద్యపాన వ్యసనం నుండి విముక్తి కల్పిస్తామని తెలిపారు.
తంబాకు నమలడం, బీడీ, సిగరెట్ త్రాగడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు వస్తాయని తెలిపారు.
చెడు అలవాట్ల వల్ల గుండె, ఛాతీలో మంట, అల్సర్స్, కాలేయం దెబ్బతినడం, మెదడు, నరాలు దెబ్బతిని మానసిక, శారీరక అనారోగ్యం ఏర్పడుతుందని అన్నారు.
సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువగా నిద్ర సమస్యలు ఉన్నాయని తెలుపుతూ వాటిని పరిష్కరించేందుకు మందులు, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో తమను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ , సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బుర్ల శ్రీమతి కార్మికులు పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >