Posted on 2025-07-02 14:23:24
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ విద్యాలయం లోని ప్రతి తరగతి గదిని తిరిగి పరిశీలించి 9వ తరగతి విద్యార్థులకు సంస్కృతం, హిందీ పాఠాలు చదివించారు. ఇందులో కొంతమంది విద్యార్థులు సంస్కృత పాఠాలను చదవ లేకపోవడం గమనించారు.
10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టులో లెక్కలు ఇచ్చి వారితో చేపించారు. 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, 8వ తరగతి విద్యార్థులకు సోషల్ బోధించారు. ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు.
కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన దేశం మొత్తం ఒకే విధంగా ఉంటుందని పోటీ పరీక్షలకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్నందున ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు అత్యున్నతమైన విద్యాభ్యాసన చేయాలని సూచించారు. అదే విధంగా పిల్లలకు సరైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేష ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >