Posted on 2025-06-30 15:37:12
పలు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు రిమాండ్ కు తరలింపు
12 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం.
పలు జిల్లాలో 16 కేసులలో నింధితునిగా ఉన్న బోదాసు మహేష్.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,
డైలీ భారత్, వేములవాడ: జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేష్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాకి చెందిన గద్దల స్వప్న,విశాల్ సింగ్ జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్,నేరెళ్ల రాణి గోత్రాల బాలమణి అను వారితో ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లు లక్ష్యంగా ఆర్ముర్,నిజామాబాద్,వేములవాడ,కొనరావుపేట,బోయినపల్లి ప్రాంతల్లో దొంగతనం చేయడానికి సరైన సమయం కోసం చూస్తుండగా తేదీ 02-05-2025 రోజున రాత్రి సమయంలో వేములవాడ పట్టణం సాయి నగర్ ప్రాతంలో దొంగతనానికి పాల్పడగా, 23-05-2025 రోజున మరల సాయి నగర్ ప్రాతంలో,12-06-2025 రోజున వేములవాడ పట్టణం భగవంతరావు నగర్ ప్రాంతంలో,తేది.11.05.2025 రోజున రాత్రి సమయంలో ఆర్మూర్ పట్టణంలోని అరుంధతినగర్ ప్రాంతంలో,తేది.16.05.2025 రోజున రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల పెరకిట్ వినాయకనగర్ ప్రాంతంలో , అదేవిదంగా తేది.25.05.2025 రోజున అర్ద రాత్రి సమయoలో ఆర్మూర్ పక్కన గల పెరకిట్ వినాయకనగర్ ఏరియాలో ప్రాంతంలో ఇక ఇంట్లో, తేది.02.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని మెడ్ ప్లస్ మెడికల్ షాప్ లో,అదేవిదంగా తేది. 07.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో,ఆదేవిదంగా తేది.16.06.2025 రోజున వేకువ జామున ఆర్మూర్ పక్కన గల పెరకిట్ RTC కాలనీలో భోదాసు మహేష్ అనే నిందుతుని ఆధ్వర్యంలో దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్న మహేష్ తో సహా ఐదుగురు నిందితులను సాంకేతికత ఆధారంగా ఈ రోజు ఉదయం తిప్పపూర్ బస్టాండ్ ప్రాతంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 12 తులాల బంగారం,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకోని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు.
నిందుతుల వివరాలు.
1.బోదాసు మహేష్, s/o కొత్తయ్య, age 30 సం.లు, వెల్లుళ్ల గ్రామం,మెట్ పల్లి మండలం,జగిత్యాల జిల్లా.
2.గద్దల స్వప్న w/o సంజీవ్, r/o మంచిప్ప గ్రామం, మోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా.
3.గోత్రాల బాలామణి w/o నర్సయ్య, r/o మంచిప్ప గ్రామం,మోపాల్ మండలం,నిజామాబాద్ జిల్లా.
4.ఠాకూర్ విశాల్ సింగ్ s/o రామ్ చరణ్ సింగ్, r/o కుమార్ నగర్, నిజామాబాద్.
5.నేరెళ్ళ శ్రీనివాస్, s/o రాజం, r/o చల్ గల్ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం, జగిత్యాల జిల్లా.
6.నేరెళ్ళ రాణి w/o నేరెళ్ళ శ్రీనివాస్, r/o చల్ గల్ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం,జగిత్యాల జిల్లా
వరుస దొంగతనాలు చెక్ పెట్టి నింధితులను పట్టుకోవడంలో కృషి చేసిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ లు అనిల్ కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సంయుద్దీన్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >