| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంచానికి పరిమితమైన గుబ్బల సతీష్ కు.. జర్నలిస్టు కిరణ్ కుమార్ గండికోట ఆర్థిక సాయం

మంచానికి పరిమితమైన గుబ్బల సతీష్ కు.. జర్నలిస్టు  కిరణ్ కుమార్ గండికోట ఆర్థిక సాయం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదవశాత్తు గోడ కూలి నడుము మీద పడడంతో గుబ్బల సతీష్ వెన్నుపూస దెబ్బతిని  రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 

కుటుంబ పోషణకు ఆటోడ్రైవర్ వృత్తిగా జీవనం సాగిస్తున్న సతీష్ గత 15 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై అవస్థలు పడుతున్న దీన పరిస్థితి.

ఆర్థికంగా కుటుంబం నలిగిపోతుంది. వైద్యం, మెడిసిన్స్ కొరకు వేలాది రూపాయలు ఖర్చవుతుంది.

సతీష్ దీన పరిస్థితి కుటుంబ ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను గమనించిన గండికోట కిరణ్ గుబ్బల సతీష్ ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని  నేనున్నానని ధైర్యం చెబుతూ.. సతీష్ కు ప్రతినెల  వెయ్యి రూపాయలు  మెడికల్ ఖర్చులకు అందజేస్తున్నారు.

ఈనేపథ్యంలో సతీష్ రెండు కాళ్లు తొలగించకుంటే ప్రాణాలకే ప్రమాదమని, హైదరాబాద్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.

సాయం చేయటానికి మంచి మనసుతో పాటు ఆర్థిక సాయం కూడా చేసే తత్వం ఉన్న కిరణ్ వారికి అండగా నిలిచి మెడికల్ ఖర్చుల నిమిత్తం  ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

 అంతేకాకుండా ఆపరేషన్ తరువాత గుబ్బల సతీష్ వారి కుటుంబ  బతుకుతెరువు కోసం  వ్యాపారం చేసుకుంటామని తెలిపారు.

 ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయి ఇంతకన్నా మానవత్వం దైవత్వం మరొకటి లేదు అనే కొటేషన్లు చదువుకొని వదిలిపెట్టే వారే ఉన్న నేటి సమాజంలో అందుకు భిన్నంగా కిరణ్ కుమార్ గండికోట ఆచరణలో చేసి చూపుతున్నారు.. 

గుబ్బల సతీష్ కుటుంబం వ్యాపారం చేసుకోవడానికి అవసరమయ్యే పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో పట్టణంలోని పలువురు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గండికోట రీల్ హీరోల కంటే రియల్ హీరో అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

Previous జూలూరుపాడు కస్తూరిబా కళాశాలకు వెళ్లే రహదారిలో వెలగని స్ట్రీట్ లైట్స్ మరియు పారిశుద్ధ్యం శూన్యం
Next తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీకీ యత్నం
ADVERTISEMENT