| Daily భారత్
Logo




అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళను తక్షణమే మంజూరు చేయాలి

News

Posted on 2025-06-23 12:49:48

Share: Share


అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళను తక్షణమే మంజూరు చేయాలి

కొత్తగూడెం కార్పొరేషన్ లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి

దోమల నివారణకు చర్యలు చేపట్టి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలి: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, కొత్తగూడెం:భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచన మేరకు సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన ధర్నాలో సీతాలక్ష్మీ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు. వెంటనే దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయించాలని సూచించారు. కొత్తగూడెంలో అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు. అన్ని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కోసం ఎక్కడికక్కడ పైప్ లైన్ ల కోసం తవ్విన గుంటలను పూడ్చి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. తవ్విన గుంటల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని విమర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. 

ఈ నిరసన ధర్నాలో మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, పల్లపు రాజు, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, మునీర్, హుస్సేన్, ఎస్సీ సెల్ రామిళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, అజ్మీరా విజయ్, రాజ మల్లయ్య, షమ్మీ, మొయినుద్దీన్, సూరి, అశోక్, నగేష్, బాబు జానీ, నాగ రాజు, మజీద్, అన్వర్ ఖాజా, తుంగ కనకయ్య, ఆర్ శ్రీనివాస్,వెంకట రమణ,రమేష్ శ్రీదేవి, శైలజ, కోమల, శ్రీనిజ, సుందర్ పాసి, టింకు, సోనీ పాసి, సౌజన్య, ఆశ, మాధవి, స్వర్ణ, లక్ష్మి, కమల, విజయ, జి విజయ, సుహాని, మహేశ్వరి, రమణ, శ్రావణ్, నసీమా, మహబూబ్, షేక్ బాజీ, షేక్ బిబి, సత్యవతి, ఖంరుణ్నిసా, షణ్ముఖ, సిద్దు, బన్ను, అమన్,  తదితరులు పాల్గొన్నారు.

Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >