| Daily భారత్
Logo




5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీ మహిళ అరెస్ట్

News

Posted on 2025-06-20 07:46:51

Share: Share


5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీ మహిళ అరెస్ట్

డైలీ భారత్, ముంబై: రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక విదేశీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి ముంబైకి బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి కాపు కాచి చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు నైజీరియన్ మహిళను ఆపి ఆమె సామాను తనిఖీ చేశారు. ఆమె లగేజీని పరిశీలించిన తర్వాత, అధికారులు స్ఫటికాకార పదార్థపు ప్యాకెట్, ఇంకా మాత్రలు కలిగిన ఫుడ్ ప్యాకెట్లు (ఓట్స్), జ్యూస్ టెట్రా ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు

NDPS ఫీల్డ్ టెస్ట్ కిట్‌ని ఉపయోగించి ల్యాబ్స్‌లో పరీక్షలు చేయగా ఆ ప్యాకెట్లలో 2.56 కిలోగ్రాముల మెథాంఫేటమిన్, 584 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు ఉన్నట్టు నిర్ధారించారు. తదుపరి ఆపరేషన్‌లో సదరు సరుకును స్వీకరించాల్సిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ అక్రమ మాదకద్రవ్య మార్కెట్‌లో సుమారు రూ. 5 కోట్లుగా అంచనా వేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985లోని సంబంధిత నిబంధనల కింద సరుకు తీసుకోబోయే నైజీరియన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తదుపరి దర్యాప్తు జరుగుతోంది

Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >