Posted on 2025-06-19 14:30:39
నోటీసులు ఇచ్చిన ఆగని జి ప్లస్ త్రీ నిర్మాణలు
నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ?
మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అక్రమ నిర్మాణాలు
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నది ఎవరు ?
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి మండలంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల జోరు నోటీసులు అందజేసినప్పటికీ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి ప్రక్కన అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. నెలరోజుల క్రితం పనులను నిలుపుదల చేసిన అధికారులు .. పట్టపగలే పైన కవర్లు తొలగించి నిర్మాణాలు చేస్తుంటే కంటపడకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.నోటీసులు అందజేశాం అంటూ చేతులు దులుపుకుంటున్న పంచాయతీ అధికారులు. నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా ? అక్రమ నిర్మాణం అని తెలిసి నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటే ఎలా వాటిని ఆపే అధికారం ఎవరికి లేదా ? అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలుస్తూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారు. అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నపురెడ్డిపల్లి చుంచుపల్లి మండల పరిధిలో ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని చర్చించుకుంటున్న ప్రజలు. జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలనీ కోరుతున్న ప్రజలు. అనుమాతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చేవరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా నోటీసులు అందజేశాము అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పనులు ఆపలేకపోతున్నా. పంచాయతీ మండల అధికారులు . ప్రధాన రహదారుల ప్రక్కనే జి ప్లస్ త్రీ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారుల కంటపడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. దాదాపు నెల రోజులు కట్టడాలు నిలుపుదల చేసిన అధికారులు. మరి ఏమి జరిగిందో ఏమో ఇంతకుముందు నిర్మాణాలకు అడ్డుగా కవర్ కప్పి పనులు చేసిన వారు ఈరోజు పైన కవర్లు తొలగించి పనులు చేస్తున్నారంటే ఏమిటి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >