| Daily భారత్
Logo




ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస

News

Posted on 2025-06-15 14:04:02

Share: Share


ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస

డైలీ భారత్, యాదాద్రి: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరితను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని..ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు అభినందనలని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.

గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. “ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలం సీత్యతండాకు చెందిన సరిత టీజీ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా విధుల్లో చేరారు. తొలి రోజు శనివారం హైదరాబాద్-మిర్యాలగూడ ట్రిప్ బస్ నడిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ గా పనిచేసిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యం ఉండటంతో వారిని చూసుకునేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. రాష్ట్రంలో బస్ డ్రైవర్ గా అవకాశమివ్వాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ లను సరిత అభ్యర్థించారు. వారు స్పందించి ఆమెకు డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పించారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >