Posted on 2025-06-12 09:42:30
డైలీ భారత్, త్రిపుర: అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచ్చెరాలోని ఒక దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్‌లో ఓ ట్రాలీ బ్యాగ్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితులు డాక్టర్ దిబాకర్ సాహా (28), అతని తండ్రి దీపక్ (52), తల్లి దేబికా (40), నబానితా దాస్ (25), జోయ్‌దీప్ దాస్ (20), అనిమేష్ యాదవ్ (21)గా పోలీసులు గుర్తించారు.
అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అగర్తలకు చెందిన షరిఫుల్ ఇస్లాం (20) అనే యువకుడు జూన్ 8న అదృశ్యమయ్యాడు. దీంతో జూన్ 9న క్యాపిటల్ కాంప్లెక్స్ (ఎన్‌సిసి) పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ, షరిపుల్ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ కుమార్ తెలిపారు. షరిపుల్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సమీప బంధువైన దిబాకర్ సాహా కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. వీరిరువురి మధ్య నడచిన ఫోన్ సంభాషణలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దిబాకర్ ప్రియురాలిని దక్కించుకోవడానికి షరిపుల్ అడ్డు తొలగించాలని భావించాడు. ఇందుకోసం పక్కా స్కెచ్ వేశాడు.
ఇంద్రానగర్‌లోని జోయ్‌దీప్ ఇంట్లో కలుద్దామని షరిపుల్‌కు ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చిన అతడిని సాహా జోయ్‌దీప్, నబనిత, అనిమేష్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత అతడి చేతులు కట్టి, మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి దిబాకర్, అతని తల్లిదండ్రులు కలిసి గండచెర్రకు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఆ సూట్‌కేస్‌ను అతని తండ్రి దుకాణంలోని ఐస్ క్రీం ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దిబాకర్ తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి షిరిఫుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురు మధ్య నడచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు మొబైల్ సందేశాల ద్వారా పోలీసులు గుర్తించారు.
ప్రేమ వ్యవహారాలు, అసూయతో మానవులు కిరాతకంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా హత్యలో భాగం కావడం, సంఘటనా తీవ్రతను మరింత పెంచుతోంది. ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం దాచిన తీరు దారుణమైన క్రిమినల్ మైండ్‌సెట్‌కు నిదర్శనం.ఈ సంఘటన త్రిపుర రాష్ట్రాన్ని మరియు దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ప్రేమ విషయంలో తట్టుకోలేని అసూయ, హత్య వరకు తీసుకెళ్లిన ఈ ఘటన, సామాజిక విలువలు, సంబంధాల విలువపై ఆలోచింపజేస్తోంది.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >