| Daily భారత్
Logo




9 ఏళ్ల బాలికపై హత్యాచారం..? సూట్‌కేసులో మృతదేహం

News

Posted on 2025-06-08 18:27:39

Share: Share


9 ఏళ్ల బాలికపై హత్యాచారం..? సూట్‌కేసులో మృతదేహం

డైలీ భారత్, ఢిల్లీ:ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసి.. ఆ తర్వాత ఆమెను సూట్‌కేసులో కుక్కి పడేయడం కలకలం రేపింది. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అన్ని చోట్ల గాలించారు. చివరికీ శనివారం సాయంత్రం నెహ్రూ విహార్‌లోని ఓ ఫ్లాట్‌లో రెండో అంతస్తులో ఓ సూట్‌కేసు కనిపించింది. అందులో ఆమె అపస్మారక స్థితిలో ఉండటం చూసి వాళ్లు షాకైపోయారు.

అయితే శనివారం రాత్రి 8.40 గంటలకు తొమ్మిదేళ్ల మైనర్‌ బాలిక గాయాలపాలైన స్థితిలో కనిపించినట్లు కాల్‌ వచ్చిందని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (నార్త్ ఈస్ట్) ఆశిష్ మిశ్రా తెలిపారు. బాలికను ఆమె తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడని.. ఆమెకు చికిత్స అందిస్తున్న సమయంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెపై లైంగిక వేధింపుల సంకేతాలు ఉన్నట్లు పేర్కొన్నారు.  

ఈ క్రమంలో హత్య కేసుతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఫోరెన్సిన్ బ-ృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరశీలిస్తున్నారు. అయితే తమ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి తన కూతురిని ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. బాలిక కుటుంబ సభ్యులు ఆ ఫ్లాట్‌కి చేరుకోగా దానికి తాళం వేసి ఉంది. దాన్ని పగలగొట్టి చూడగా.. దుస్తులు లేకుండా బాలిక సూట్‌కేసులో అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసుతో పాటు, తీవ్రమైన లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి. నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని స్కాన్ చేస్తున్నారు. కాలనీలో ఉంటున్న ఒక వ్యక్తి బాలికను తన ఫ్లాట్‌కి తీసుకెళ్లినట్లు ఆమె తండ్రి చెప్పారు. బాలిక కుటుంబీలకు ఫ్లాట్‌కి చేరుకోగా, తాళం వేసి ఉంది. తాళాలు పగలగొట్టి చూడగా దస్తులు లేకుండా బాలిక సూట్‌కేస్‌లో అపస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు తెలిపారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >