| Daily భారత్
Logo




24 గంటల్లో దోపిడీ కేసును చేధించిన వేములవాడ పట్టణ పోలీసులు

News

Posted on 2025-06-04 18:18:33

Share: Share


24 గంటల్లో దోపిడీ కేసును చేధించిన వేములవాడ పట్టణ పోలీసులు

దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందుతులు అరెస్ట్ , రిమాండ్ కి తరలింపు..

09 గ్రాముల బంగారం,ఒక గ్యారెంటీ చైను, ఒక కత్తి, ఆటో, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం...

వివరాలు వెల్లడించిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈనాయత్ నగర్ గ్రామం కమ్మర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన బడవత్  తిమ్మి w/o మనోహర్ అనే మహిళ  తేదీ 01-06-2025 రోజున వేములవాడ దైవదర్శనానికి రాత్రి సుమారు 7:30 గంటలకు రాగా, తిప్పాపూర్ బస్టాండ్ ముందు ఆటో స్టాండ్ వద్ద ఒక వ్యక్తి నిలబడి ఆమెను మీ బంధువులు గుడి వద్ద ఉన్నారని నాకు తెలుసని మిమ్మల్ని గుడి వద్దకు తీసుకు వెళ్తానని మాయమాటలతో నమ్మించి ఆమెను తన ఆటోలో ఎక్కించుకొని వేములవాడలోని చెక్కపల్లి రోడ్డులో గల పెద్దమ్మ టెంపుల్ ప్రాంతానికి తీసుకువెళ్లి, అక్కడ ఎవరు లేని సమయంలో ఆమెను కత్తి తో బెదిరించి ఆమె మెడలో నుండి బంగారు ఆభరణాలైన 3 గ్రాముల పుస్తెలు,4 గ్రాముల చెవి కమ్మలు,2 గ్రాముల  మాటీలు మరియు ఒక గ్యారెంటెడ్ చైను మరియు పరుసులో ఉన్న నగదు డబ్బులు సుమారు 3000 రూపాయలు ఆమె నుండి దోపిడీ చేసుకొని పారిపోగా,తేదీ 03-06-2025 రోజున బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్  కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఈరోజు తేదీ 04.06.2025 రోజున సంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు అయిన బోదాసు అశోక్ r/o ఎల్లంపేట, కామారెడ్డి అనునతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అట్టి దోపిడి చేసిన బంగారు ఆభరణాలను కొన్ని తనవద్ద ఉంచుకొని మిగతావి తన స్నేహితుడు అయిన బొమ్మిడి గణేష్ వద్ద దాచి పెట్టినానని తెలుపగా ఇద్దరు వ్యక్తులను ఈ రోజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3 గ్రాముల పుస్తెలు,4 గ్రాముల చెవి కమ్మలు, 2 గ్రాముల  మాటీలు,ఒక రోల్డ్ గోల్డ్ చైన్, ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది తెలిపారు.

నిందితుడు అయిన బోదాసు అశోక్ r/o ఎల్లంపేట, కామారెడ్డి గతంలో కూడా Ela Surendar s/o Devaiah, age: 45 years, Caste: SC-Madiga, r/o Thornal(v) of Siddipet Mandal & Dist అను అతనిని కూడా నమ్మించి తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నుండి ATM కు వెళ్ళి వస్తానని అతని బజాజ్ pulsar బండి ని కూడా దొంగిలించినాడు.

నిందుతుల వివరాలు..

A-1 బోదాసు అశోక్ s/o రాములు, age: 33 years, caste: వడ్డెర r/o ఎల్లంపేట, అన్నారం, మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా ప్రస్తుత నివాసం బాలానగర్, వేములవాడ టౌన్ .

A-2 బొమ్మిడి గణేష్ s/o బాలయ్య, age: 25 years, caste: Myadari r/o రేకుర్తి, కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా ప్రస్తుత నివాసం జాతర గ్రౌండ్, వేములవాడ టౌన్ 

నిందితులను 24 గంటలలో పట్టుకున్న వేములవాడ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ లత,కానిస్టేబుల్ లు గోపాల్, సమీయుద్దీన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >