| Daily భారత్
Logo




భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-06-03 13:35:47

Share: Share


భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం షాబాద్ మండలం పోలారం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్,  నిషేధిత భూములు,

ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులభతరం అవుతుందని తెలిపారు.     ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా  గ్రామీణ ప్రజల,  రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి రూపొందించడం జరిగిందని అన్నారు.  ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజల వద్దకు అధికారులే వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనమాలు, పాసు పుస్తకాలలోని సమస్యలను  పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఆధార్ తరహాలో భవిష్యత్తులో భూములకు సంబంధించి సర్వే చేసి, హద్దులు, కొలతలు, భూముల వివరాలు ఒకే పుస్తకంలో ఉండేలా ‘భూధార్’ను రూపొందించనున్నట్లు తెలిపారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ భారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవోకు, అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్,మాజీ ఎంపిటిసి అశోక్ , మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, రవీందర్ నాయక్,మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లింగం నాయకులు ప్రభాకర్ రెడ్డి,సంజీవ రెడ్డి,సుభాష్ రెడ్డి, కిషోర్,శ్రీనివాస్ రెడ్డి,మాధవ్ రెడ్డి,శేఖర్, రఫిక్, సూర్య, దయాకర్,శ్రీనివాస్, అధికారులు,పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు...

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >