Posted on 2025-06-02 07:49:41
మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి
డైలీ భారత్, మహబూబాబాద్: నేడు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించిన మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి
అనంతరం ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్తున్నాం.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భూ-భారతి చట్టం, విద్యార్థుల కోసం ఇటీవలే నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. సుమారు 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేంట. కృషి చేస్తున్నాన్నారు.
ప్రత్యేకంగా మన మహబూబాబాద్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు
పార్టీలకు అతీతంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తున్నానని, నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచే విధంగా 24/7 కష్టపడి పని చేస్తున్నామని, నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే డా మురళీ నాయక్ కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు,అన్ని సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >