| Daily భారత్
Logo




అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-06-01 14:40:19

Share: Share


అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు  : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మొయినాబాద్ l మండలం మేడిపల్లి, వీరన్నపేట్, హిమాయత్ నగర్ గ్రామంలో  గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు  చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ సర్టిఫికెట్ అందించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు.అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >