| Daily భారత్
Logo




హిందీ ఉపాధ్యాయ శిక్షణా తరగతులను సందర్శించిన SCERT డైరెక్టర్

News

Posted on 2025-05-29 14:10:29

Share: Share


హిందీ ఉపాధ్యాయ శిక్షణా తరగతులను సందర్శించిన SCERT డైరెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంచే ఉపాధ్యాయ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు చక్కగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా  ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని డిజిటల్ సాధనాలతో  సమ్మిళితం చేసుకుంటూ విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించి వారి అభ్యసనం సులభతరం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు అభ్యసించడానికి వస్తున్నారని వారి  కోసం ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధిగా విధులు నిర్వహిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలని, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని పేర్కొంటూ బోధనా పద్ధతుల్లో డిజిటల్ వినియోగ మెలకువలు నేర్పించే ఈ శిక్షణ తరగతుల్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ కి మరియు ఈ శిక్షణా తరగతుల్లో రిసోర్స్ పర్సన్స్ గా విధులు నిర్వహిస్తున్న పోర్ల వేణుగోపాలరావు, శ్రీరాం మనోహర్, పర్కాల రవీందర్,  అబ్దుల్ రవూఫ్ లను ప్రశంసిస్తూ సన్మానించారు. 

శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కోర్స్ కోఆర్డినేటర్  శ్రీమతి శైలజ మరియు హిందీ విషయ ఉపాధ్యాయ శిక్షణా కేంద్ర అధికారి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డా. చకినాల శ్రీనివాస్ ను అభినందించి సత్కరించారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >