| Daily భారత్
Logo




కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ గాజర్ల రమేష్

News

Posted on 2025-05-29 14:04:00

Share: Share


కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ గాజర్ల రమేష్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:గురువారం స్థానిక వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఎస్సీఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొని పాఠశాలలో పిల్లల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన మెలకువలు నేర్చుకొని పాఠశాలలో సమర్థవంతంగా బోధనను నిర్వహించాలని సూచించారు పాఠశాలల్లో ఉన్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను సమర్ధవంతంగా ఉపయోగించడం అందరూ ఉపాధ్యాయులు నేర్చుకోవాలి వివిధ రకాల ఐ సి టి టూల్స్ను నేర్చుకొని పిల్లలకు నేర్పించాలని సూచించారు వెంకంపేట పాఠశాలలో జరుగుతున్న రెండవ దశ జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంను సెంటర్ ఇన్చార్జి జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రిసోర్స్ పర్సన్లు రాష్ట్రస్థాయిలో మెలకువలను జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులకు నేర్పాలని సూచించారు అనంతరం రెండోదశ శిక్షణా కార్యక్రమంలో ఉత్తమ పార్టిసిపెంట్స్ గా నిలిచిన పావని, రవీందర్, శ్రీలత మనోహర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య రిసోర్స్ పర్సన్లు వంగల తిరుపతిరెడ్డి ,ఎన్ భాస్కర్, దూస సంతోష్, యాద రవి మరియు వివిధ మండలాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >