| Daily భారత్
Logo




బాలానగర్‌ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్‌ వేటు

News

Posted on 2025-04-26 07:46:35

Share: Share


బాలానగర్‌ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్‌ వేటు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలున్నాయి.

తాజాగా, ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన ముగ్గురు వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >