డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం, సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద గల సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఆఫీసు నందు మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం మరోసారి దళితులను వంచించే కుట్రలో భాగమని,రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు మూడు లక్షలు ఇస్తున్నామని చెప్పి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఇస్తానన్న 12 లక్షలు ఎగనామం పెట్టడానికి దళితులను మోసం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం ద్వారా దళితులకు 10 లక్షలు ఇస్తే , ఎలక్షన్ హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం స్కీం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తట్లేదని, ఒక దిక్కు అసంబద్ధంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాల సామాజిక వర్గ ఆగ్రహానికి లోనవుతూ మరో దిక్కు అంబేద్కర్ అభయ హస్తం ఇవ్వకుండా దళితులను మోసం చేస్తూ,ఏవేవో పనికిరాని మూడు లక్షల స్కీమ్ ల ఆశ నిరుద్యోగ యువతకు చూపెడుతూ, దళితులందరినీ రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తుందని,**ఇదంతా కుండలు పెట్టి బిందెలు దొబ్బే ప్రయత్నం లో భాగమేనని** దళిత సామాజిక వర్గం ఇదంతా క్షుణంగా గమనిస్తుందని రాజీవ్ యువ వికాసం వద్దు :అంబేద్కర్ అభయహస్తం ముద్దు అని ఇప్పటికైనా దళితులకు అంబేద్కర్ అభయహస్తం స్కీంను ఇవ్వాలని లేనిపక్షంలో రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ అల్లాడి. పాల్రాజ్, పినపాక నియోజకవర్గం ఇన్చార్జ్ పిల్లి. రవి వర్మ, అశ్వరావుపేట బాధ్యులు చల్లా. పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
News
రాజీవ్ యువ వికాసం స్కీం పేరుతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం (దళిత బంధు ) ఎగనామం పెట్టేందుకు కుట్ర : పూల.రవీందర్. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు