| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అట్టహాసంగా సీనియర్స్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

అట్టహాసంగా సీనియర్స్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా జూలూరుపాడు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటైన సీనియర్స్ నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయంను వైరా శాసనసభ్యులు మాళోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్య క్షులు గా ఎన్నికైన షేక్ జానీ కి, ప్రధాన కార్య దర్శి చాపలమడుగు నరసింహారావు కి అలాగే ప్రెస్ క్లబ్ పాలక వర్గానికి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్, చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పూర్తి సహకారం జర్నలిస్టులకు ఉంటుంది అని అలాగే మీ సమస్యలు పరిష్కారంకోసం మేము ప్రత్యేక దృష్టితో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా పని చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోరిక అందని ద్రాక్ష లాగే మిగిలిపో యిందని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు తపకుండా అందుతాయని అన్నారు. దాదాపు ఒక ఏడాది లోనే అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు, నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపు, ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నిజాన్ని నిర్భయంగా వెలికి తీసే జర్నలిస్టులకు ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంకి మంచి వేదికను ఏర్పాటు చేయడం శుభ సూచికం అన్నారు. అలాగే జర్నలిస్ట్ల సమ స్యలు కూడా మంత్రి దృష్టిలో ఉన్నాయని వాటిని కూడా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలు తొందరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్య క్రమంలో అధికారులు  నాయకులు జర్నలిస్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి
Next రాజీవ్ యువ వికాసం స్కీం పేరుతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం (దళిత బంధు ) ఎగనామం పెట్టేందుకు కుట్ర : పూల.రవీందర్. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు
ADVERTISEMENT