డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట చెరువు కు చెందిన వ్యక్తీ అయిన పుట్టల నరేష్ S/o రాములు(లేటు), వయస్సు:33 సంవత్సరాలు, కులం: SC- మాదిగ, వృత్తి:పెయింటింగ్, R/o పేటచెరువు, పాల్వంచ అను వ్యక్తీ తేది:11.02.2025 నాడు మృతి చెందగా ఇట్టి వ్యక్తీ మృతి పై అనుమానం కలదు అని మృతుని తల్లి అయిన పుట్టల చుక్కమ్మ యొక్క ఫిర్యాదు మేరకు తేదీ: 17-02-2025 నాడు కేసు నమోదు చేసి, పేటచేరువు స్మశానం లో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పంచనామా మరియు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కేసు దర్యాప్తు చేస్తుండగా, లభించిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ఇట్టి కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు అయిన గద్దల సాంబశివరావు S/o నర్సయ్య, 37 సo.లు., SC-మాదిగ, సుతారి పని R/o ఉప్పాక గ్రామం, పినపాక మండలం మరియు ఇతని స్నేహితుడు అయిన తాటి నరేష్ S/o చిన్ని, 25 సంవత్సరాలు కోయ, కూలి పని R/o సూరవీడు కాలని, వెంకటాపురం గ్రామం, & మండలం, ములుగు జిల్లా అదుపులోకి తీసుకొని విచారించగా, గద్దల సాంబశివరావుకు మరదలు అగు మృతుడు అయిన పుట్టల నరేష్ భార్య పుట్టల రజిత తో అక్రమ సంభందం ఉన్నదన్న విషయం మృతుడు అయిన పుట్టల నరేష్ కు తెలిసి రజిత ను ఇబ్బంది పెడ్తుంటే,సాంబ శివరావు మరియు రజితలు ఇద్దరు కలిసి పుట్టల నరేష్ ను అడ్డుతోలగించుకోవాలని ఒక పథకం ప్రకారం తేది: 10/02/2025 నాడు నరేష్ మరియు రజిత సారపాక తన బంధువుల ఇంటికి వెళ్ళినపుడు గద్దల సాంబశివరావు మరియు అతని స్నేహితుడు అయిన తాటి నరేష్ సహాయం తో ముందస్తు పథకం ప్రకారం పుట్టల నరేష్ కు మద్యం బాటిల్ లో పురుగుల మందు కలిపి తాటి నరేష్ సహాయం తో పుట్టల నరేష్ కు అట్టి మద్యం బాటిల్ ఇవ్వగా, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత పుట్టల నరేష్ అదే మద్యం తాగటం వల్లనే అస్వస్తత కి గురి అయి తేది: 11.02.2025 నాడు మరణించాడు అని విచారణలో తెలిసింది.
అంతే కాకుండా పుట్టల నరేష్ తదుపరి దినసరి కార్యక్రమాలలో అదే మద్యం ను పెటచేరువు కు చెందిన పెద్ద మనిషి బొజ్జా వెంకటేశ్వర్లు తాగగా అతనికి కూడా ఆరోగ్యం క్షీనించి హాస్పిటల్ నందు చికిత్స పొందాడు,ప్రస్తుతం బొజ్జా వెంకటేశ్వర్లు ఆరోగ్యం కుదుట పడి ఖమ్మం ఆరోగ్యా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
ఇట్టి కేసు లో ముగ్గురు నిదితులు అయిన
1) గద్దల సాంబశివరావు S/o నర్సయ్య, 37 సo.లు., SC-మాదిగ, సుతారి పని R/o ఉప్పాక గ్రామం, పినపాక.
2) తాటి నరేష్ S/o చిన్ని, 25 సంవత్సరాలు కోయ, కూలి పని R/o సూరవీడు కాలని, వెంకటాపురం గ్రామం, & మండలం, ములుగు జిల్లా
3) పుట్టల రజిత w/o నరేష్,32 సంవత్సరాలు R/o పేటచెరువు ను అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం తరలించనైనది.