మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్ర నాయకులు డప్పు రాజు
డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్కుల్ గ్రామంలో మరియు బీరంగూడ కమాన్ వద్ద జగనన్న అభిమానులు కార్యకర్తలు నాయకులు మరియు మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్ర నాయకులు డప్పు రాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, వై ఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది,.
అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రారంభించిన అప్పటినుండి ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబ సభ్యులు పార్టీలో పనిచేయడం జరిగింది ఇప్పటికి కూడా వైఎస్ఆర్సిపి పార్టీల్ని కొనసాగుతూ ముందుకు వెళుతున్నానని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీని మళ్లీ ప్రారంభించే విధంగా జగనన్నను కలిసి తెలంగాణలో ఉన్న నాయకుల ఆధ్వర్యంలో అందరం కలిసి చర్చించి తెలంగాణలో కూడా మళ్లీ పార్టీని స్థాపించే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని డప్పు రాజు అన్నారు ఈపార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది,