భారీ సంఖ్యలో హాజరైన మహిళలు
డైలీ భారత్, న్యూస్, పఠాన్ చేరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నా నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మలోత్ కవిత, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ మాట్లాడుతు... మహిళా దినోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో జరుపుకున్నామని అయన అన్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవి. మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బి ఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వారు అన్నారు. మహిళలకు ఒక మంచి గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్థిక పరిస్థితులు లేని పేద కుటుంబాలకు పెద్దన్నగా నిలిచి గొప్ప నిర్ణయం తో దేశంలోనే ఎక్కడలేని ఒక బ్రహ్మాండమైన సంక్షేమ పథకం కల్యాణ లక్ష్మి షాది ముబారక్, మరియు ఒక ఆడబిడ్డ డెలివరీ కి వెళ్తే ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా మహాలక్ష్మి పథకంతో డెలివరీ తర్వాత ఆడపిల్ల పుడితే 13000 వేల ఒకటి, మగ బిడ్డ పుడితే 12000 వేల రూపాయలు అందించి వారిని ఇంటికి చేర్చే విధంగా ఆరోగ్యంగా పూర్తి బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. సంక్షేమ పథకంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని రాష్ట్రంలోని మళ్లీ బి ఆర్ ఎస్ రావాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయని తెలిపారు . కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఇస్తానన్న 2500 రాలేవుని విద్యార్థులకు ఇస్తానన్న స్కూటీలు ఇంతవరకు అందజేయలేదని, ఆడపడుచు వివాహానికి ఇస్తానన్న లక్ష రూపాయలు తులం బంగారం ఎక్కడ పోయిందని రేవంత్ ప్రభుత్వాన్ని మహిళలు సంవత్సరం గడిచిన మహిళకు అందకపోవడం ఒంటరి మహిళలకు 4000 రూపాయల పెంచినంతవరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఉతుత్త ఆమీ ల తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మని అన్నారు ఈ కార్యక్రమానికి బి ఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి , శ్రీకాంత్ గౌడ్ , బి ఆర్ ఎస్ నాయకురాలు కాటా సునీత రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు