డైలీ భారత్, రాజమండ్రి: తేదీ.11.03.2025 వ తేదీ తెల్లవారుజామున ఉదయం 04.00 గంటలకు తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ మండలం, కొంతమూరు గ్రామ పరిధిలోని ఎయిర్పోర్ట్ రోడ్ లో గల కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద రంపచోడవరం వైపు నుండి అధిక మొత్తంలో గంజాయి రవాణా చేయబడుతుందన్న పక్కా సమాచారంతో కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద వాహన తనిఖీ చేయుచుండగా 150 కేజీల గంజాయిని ఒక కారు డిక్కీలో పెట్టుకుని ఆ కారుకి పోలీస్ తనిఖీల గురించి ముందస్తు సమాచారం ఇచ్చే నిమిత్తం పైలట్ గా వ్యవహరించే ఒక ఆటో రెండూ ఒకదాని వెంబడి మరొకటి రంపచోడవరం వైపు నుండి ఎయిర్పోర్ట్ రోడ్డు గుండా వస్తు NH-16 హైవే ఎక్కే క్రమంలో పోలీసువారిని చూచి పారిపోతున్న కారు మరియు ఆటోను రాజనగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోహర్ మరియు సిబ్బంది పట్టుకుని తనిఖీ చేయడం జరిగింది. సదరు తనిఖీ లో 150 కేజీల గంజాయి, ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు చొప్పున మొత్తం 75 ప్యాకెట్లు కారు డిక్కీలో బయటపడినవి.
సదరు గంజాయిని వ్యాపారం కొరకు AOB ఏజెన్సీ నుండి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తుంది. కావున పై అయిదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 150 కేజీల గంజాయిని, వాటి రవాణా కొరకు ఉపయోగిస్తున్న AP39A3333 నంబర్ గల swift dezire కారు మరియు AP39 TH8737 నంబర్ గల ఆటో, మరియు వారి యొక్క 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. సదరు గంజాయిని ఎవరి వద్ద కొన్నది మరియు ఎవరికి అమ్మవచ్చునన్నది తదుపరి దర్యాప్తులో తెలుసుకుని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుంది.
ముద్దాయిల వివరాలు
1) షేక్ ఇంతియాజ్, S/o. అక్బర్, Age / 35 సం., లు C/ ముస్లిం, D.No. 9-47, నయా స్ట్రీట్, కంభం గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా.
2) షేక్ అబ్దుల్ సలీం @ అలియాస్ సలీం, S/o సబూర్ బాషా, Age/ 40 సంవత్సరాలు, Caste/ముస్లిం , సింగరాయికొండ గ్రామము మరియు మండలం, ప్రకాశం జిల్లా.
3) సంకురు బుచ్చి రెడ్డి @ బుచ్చి, S/o పండు రెడ్డి, వయసు- 24 సంవత్సరాలు, కులము/ ఎస్టి -కొండ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆఫీస్ వెనుక, సీతం సెట్టినగర్, రంపచోడవరం గ్రామము మరియు మండలం, ASR- జిల్లా.
4) ముర్ల చిన్నారెడ్డి @ జెట్లీ, S/o సోమిరెడ్డి, Age/24 సంవత్సరములు, Caste/ST- కొండరెడ్డి, D.No. 4-11, సంత మార్కెట్ వద్ద, రెడ్డి పేట, రంపచోడవరం గ్రామం మరియు మండలం. ASR-జిల్లా.
5) ఉలుగుల రవికిరణ్ రెడ్డి@పండు, S/o చిన్నారెడ్డి, Age/ 27 సంవత్సరములు, Caste/ ఎస్టి-కొండరెడ్డి, D.No.1-50, ఎంపీపీ స్కూల్ వద్ద, బూసి గూడెం గ్రామము, రంపచోడవరం మండలం. ASR- జిల్లా.
తూర్పు గోదావరి జిల్లా SP నరసింహ కిషోర్ ఆదేశాలతో, నార్త్ జోన్ DSP Y. శ్రీకాంత్ పర్యవేక్షణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన రాజానగరం ఇన్స్పెక్టర్ SP వీరయ్య గౌడ్, SI P.Manohar, వారి సిబ్బంది కానిస్టేబుల్స్ రమణ (PC 1321), నాగేశ్వరరావు (PC 1622) , కరీముల్లా ఖాదర్(PC 1369) లను SP.నరసింహ కిషోర్, IPS అభినంధించినారు.