డైలీ భారత్, ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు ఒక్కొక్కరు సురక్షితంగా బయటకొస్తున్నారు. చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ సొరంగం ఈ నెల 12న కొంతభాగం కుప్పకూలడంతో కార్మికులు సొరంగంలోని ఖాళీ ప్రదేశంలో చిక్కుకున్నారు. దాదాపు 17 రోజుల పాటు వారిని కాపాడేందుకు అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగాయి. బయటకు తీసుకొచ్చిన వెంటనే వైద్య చికిత్స అందించేందుకు సొరంగం లోపల తాత్కాలిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయు మార్గంలో తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.
News