డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత దేశ సామాజిక పరివర్తన ఉద్యమకారుడు, మహాత్మ జ్యోతిబాపూలే 133వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబెడ్కర్ నగర్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. అంజయ్య సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అంజయ్య సార్ మాట్లాడుతూ ఆనాటి రోజుల్లో మహాత్మ జ్యోతిబాపూలే గారు సాంఘిక సంస్కరణ ఉద్యమాల లో భాగంగా భారతదేశంలో 1848లో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి, స్త్రీ విద్య విధానానికి బాటలు వేసిన గొప్ప దార్షానికులు అన‌్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం నిర్మూలింప చేసి, వితంతువు వివాహాలను జరిపించినటువంటి గొప్ప సంస్కరణ వాది మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. తన జీవితాంతం బహుజన జాతుల ఉద్ధరణ కోసం ఉద్యమాలు చేసి, తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమయిలు మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థి , విద్యార్థులు పాల్గొన్నారు.
News