| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుండి144 సెక్షన్ అమలు: రామగుండం కమిషనర్ రేమారాజేశ్వరి

నేటి నుండి144 సెక్షన్ అమలు: రామగుండం కమిషనర్ రేమారాజేశ్వరి

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  ప్రశాంతమైన వాతా వరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు రామ గుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు.

1.రామగుండం పోలీస్ కమీషనరరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల జోన్ పరిధిలో ఐదుగురు లేదా?అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.

 2.రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. 

3.మైకులు, లౌడ్‌ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. 

4.విజయోత్సవ ర్యాలీలు, సభలు,సమావేశాలు నిర్వహించవద్దన్నారు.

5.ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకా యలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,

మరియు ఎన్నికల సంఘం యొక్కనియమ నిబం ధనలు ఉల్లంఘించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ రెమా రాజేశ్వరి  తెలిపారు.

Previous గెలిపిస్తే జయయాత్ర ఓడిస్తే శవయాత్ర : బి.ఆర్.ఎస్ అభ్యర్థి
Next సొరంగంలోనే 17 రోజులు.. క్షేమంగా బయటకొచ్చిన కార్మికులు
ADVERTISEMENT