డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ తిరుమలపాలెం మండలం సుద్ధవాగుతండా కు చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బానోత్ మల్లికార్జున్ ను ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య.
బిఆర్ఎస్ కార్యకర్త బానోతు మల్లికార్జున్ పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై తక్షణం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు తక్షణం చర్యలు తీసుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించవలసిందిగా వారు కోరారు.
కార్యక్రమంలో వీరితోపాటు ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు బాషబోయిన వీరన్న, బానోత్ రవి, ముత్యాల అప్పారావు, మహర్షి కొల్లిపర తదితర నాయకులు పాల్గొన్నారు.