| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  ఎమ్మెల్సీ నాగర్ కుంట  నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగజేయాలని, ఆయురారోగ్యాలతో నిత్య నూతనంగా ఉండాలని, ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజల కోరికలు నెరవేరాలని, అందరికీ కలిసి రావాలని, అందరి ఆకాంక్షలు  నెరవేరాలని, ప్రజలందరూ జీవితం అత్యుత్తమంగా సాగాలని, వ్యాపారంగంలో వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పాడి పంటలతో రైతన్నలందరూ సంతోషంగా ఉండాలని, రైతన్నల ఇల్లు  సమృద్ధిగా నిండాలని, నాయకులు రాజకీయంగా ఎదగాలని, విద్యార్థిని విద్యార్థులు అందరూ  చదువులో ముందంజలో ఉండాలని, ఈ నూతన సంవత్సరం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి  ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
Next కోడి పందాల శిబిరంపై అన్నపరెడ్డిపల్లి పోలీసులు దాడులు
ADVERTISEMENT