| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.,ఐపిఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:  సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని వీధులలలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. అనంతరం జిల్లా ప్రజలకు,పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు జిల్లా పోలీస్ శాఖ తరువున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..2025 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని,శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువగా పని చేస్తామని అన్నారు.నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటు పోలీస్ శాఖ ఎప్పుడూ మీ సేవలో ఉంటుందని  పేర్కొన్నారు. 

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా జిల్లాలో విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా,బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని.ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే డయల్ 100 కాల్ చేయాలని తెలియజేయాలని సూచించారు.పోలీసు వారి నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఐ సుధాకర్, సిబ్బంది ఉన్నారు.

Previous తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు
Next నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT