డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర తెలంగాణ వాసులు, దేశవిదేశాలలో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.నూతన సంవత్సరం-2025 ఆరంభం సందర్భంగా వేడుకలను ప్రశాంతంగా, ఆనందంగా, ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జరుపుకోవలసిందిగా,మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని యువతకు ఎంపీ రవిచంద్ర హితవు పలికారు.కొత్త ఆలోచనలు, ఆకాంక్షలు,సుస్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ, నిబద్ధత,పట్టుదలతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎంపీ వద్దిరాజు యువతను కోరారు.కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో తులతూగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఎంపీ రవిచంద్ర అభిలషించారు.
News
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు