డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:నూతన సంవత్సర వేడుకలలో ఎవరైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం ఎక్కి రోడ్డుపైకి వస్తే జరిమానా పడడంతో పాటు కటకటాల పాలవుతారని కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ హెచ్చరించారు.పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని వివిధ కూడళ్ళలో డిసెంబర్31వ తేదీ నుంచి జనవరి1వ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తమ కోసం ఇంటి వద్ద భార్య, పిల్లలు తల్లితండ్రులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వాహనదారులకు కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ సూచించారు. కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
News
మద్యం తాగి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే వాహనం సీజ్ జైలు శిక్ష.. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్