| Daily భారత్
Logo




ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

News

Posted on 2024-12-30 19:53:35

Share: Share


ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ... సీటుబెల్ట్, హెల్మెట్ ధరించాలి

ప్రమాదంలో యువతే ఎక్కువ ప్రాణాలు కోల్పోవటం బాధాకరం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. 

ట్రాఫిక్ పోలీసులు, చలాన్లు రాస్తున్నారని సీటు బెల్ట్, హెల్మెట్ ధరించటం మంచి పరిణామమే అయినా... సామాజిక బాధ్యతగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి... యువకులకు అవగాహన కల్పించాలని కేఎల్ఆర్ కోరారు.

తుక్కుగూడ కార్యాలయంలో 2024కు బైబై చెబుతూ... 2025కు స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపుతున్న యువతీయువకులకు పలు సూచనలు చేశారు.

దేశవ్యాప్తంగా 1.70లక్షల మంది ఏడాదిలో ప్రాణాలు కోల్పోగా... అందులో యువకులే 60 శాతమంది ఉన్నారని కిచ్చెన్న వెల్లడించారు.

తెలంగాణలో ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు 20,702 జరగ్గా... 6వేల 500 మంది ప్రాణాలు కోల్పోయి.. వేలాది మంది గాయపడ్డారని లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

చట్టాలను గౌరవించటం, ట్రాఫిక్ రూల్స్ పాటించటం, స్కూల్ సహా యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మెట్రో నగరాల్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని నిద్రలేని, రోడ్డు గుంతలు, పశువులు, పొగమంచు, అతివేగం సహా మద్యం మత్తులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు. విధిగా సీట్ బెల్డ్ పెట్టుకోవటం కనీస బాధ్యత అన్నారు. పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు, కఠిన నియమ, నిబంధనలు పాటిస్తే... వాహనదారులు ప్రమాదాలకు దూరమై... కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కేఎల్ఆర్ తెలిపారు. 

2025లో కొత్త ఆలోచనలతో యువత, పార్టీ నాయకులు భవిష్యత్ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని సూచించారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >