| Daily భారత్
Logo




పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు

News

Posted on 2024-12-29 23:07:38

Share: Share


పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు

డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవి కథనం ప్రకారం, నిన్న అనగా తేదీ 28.12.2024న సాయంకాలం 06:00గంటల సమయంలో చండ్రుగొండ క్రాస్ రోడ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ దయానందం మరియు బ్లూ కోట్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహిస్తుండగా, అదే సమయంలో ఒక వ్యక్తి తన ఆటోను గుండెపుడి వైపు నుండి చండ్రుగొండ క్రాస్ రోడ్ వైపునకు అతివేగముగా, ఆజాగ్రతగా, నిర్లక్ష్యంగా ప్రజలకు హాని కలిగించే విధంగా నడుపుకుంటూ వస్తుండగా,అట్టి ఆటోను ఆపేందుకు దయానందం ప్రయత్నించగా, పోలీసు సిబ్బందిని చూసి ఆటో మరింత వేగంతో వెళ్తుండగా, వెంబడించి పట్టుకొని ఆటోను ఆపగా, సదరు వ్యక్తి పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, ఏకవచనంతో సంబోధించి, ఆటో ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చారురా అంటూ నెట్టివేసే ప్రయత్నం ప్రయత్నం చేయగా, సదరు ఆటో డ్రైవరు అయిన బాదావత్ కామేష్,తండ్రి పేరు: వెంకన్న, నివాసము బద్రు తండా, అను  అతనిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా, హెడ్ కానిస్టేబుల్ దయానందం ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది.

చట్టాన్ని అతిక్రమించి పోలీసు వారిని ఇబ్బందులకు గురి చేసిన, పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించిన, శాంతి భద్రతల సమస్యలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా ఎస్సై రవి మండల ప్రజలకు తెలియజేసినారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >