Posted on 2024-12-27 22:48:12
డైలీ భారత్, న్యూఢిల్లీ: గొప్ప ఆర్థిక సంస్కర్త, మేధావి దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావులు సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న వెంటనే వారు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి,పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అధ్యాపకుడిగా, ఆర్థిక సలహాదారుగా,యుజీసీ ఛైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా,ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన ఎనలేని సేవల్ని స్మరించుకున్నారు. దివంగత మాజీ ప్రధాని సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్,ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కేటీఆర్, సురేష్ రెడ్డి,రవిచంద్ర, దామోదర్ రావులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >