డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా కన్నుల పండుగ జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం గురు స్వామి శ్రీ శ్రీ గిరిషన్ నాయర్ చేతుల మీదుగా, స్వాముల శరణు ఘోషల మధ్య, స్వాముల సుమధురమైన భజన కీర్తనలతో కమనీయంగా సాగింది. మహా పడిపూజ లో అయ్యప్ప స్వాములు చివరగా జ్యోతి ప్రజ్వలన గావించే అయ్యప్ప మహా పడివందనాన్ని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి 4,44, 444 రూపాయలకు దక్కించుకొని మహా పడివందన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మహా పడి పూజ అనేది 18 పవిత్ర మెట్ల పదునెట్టంపాడి పూజ, ఇది పుష్పాభిషేకం అని పిలువబడే విగ్రహానికి పుష్ప స్నానం చేయించి గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించుకునే తంత్ర పూజ. స్వామి అయ్యప్ప.. శరణం అయ్యప్ప.. మణికంఠ మందారం.. గురుస్వాములు బంగారం అంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలిచే అయ్యప్ప స్వాముల కోరికలు తీర్చే, అందరి క్షేమం కొరే మహా పడివందన కార్యక్రమంలో పడి వందనం చేయడం సాక్షాత్తు అయ్యప్ప స్వామిని సేవించడం, ఈ జన్మలో మహా పుణ్యమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. సకల పాప హరణం, సర్వజనహితం, సకల జన సంక్షేమం కోసం జరిపించే ఈ మహా పడిపూజ కార్యక్రమంలో
ఎమ్మెల్సి నవీన్ రెడ్డి తో పాటు మాజీ జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మామిడి జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్స్ వెంకట్ రాం రెడ్డి స్వామి, మాదరం నరసింహ స్వామి, పిల్లి శేఖర్ స్వామి మరియు లక్ష్మయ్య స్వామి, హరిజీవన్ స్వామి,కావేటి వీర మల్లేష్ సుజీవన్ స్వామి, వంకాయల రాంరెడ్డి స్వామి, అశోక్ గౌడ్ స్వామి, శ్రీకాంత్ గౌడ్ స్వామి, మరియు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.