డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మున్నూరు కాపు సంఘ నాయకులు మాట్లాడుతూ..
7 ఏళ్ల రాజకీయాలలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పేదలకు ఇళ్ల పట్టాలు కోసం రంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కిరాయి మూకలు హత మార్చడం తద్వారా అయన మరణాంతర నుండి ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, రంగా ఏ ఒక్క కులానికి చెందిన వారు కాదని అయన అన్ని కులాలకు ఆరాధ్యదైవమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడికి లేనంతగా సుమారు 2లక్షలపై విగ్రహాలు ఉన్న ఏకైక దైవం ఒకే ఒక్క రంగా అని, మేము మిమ్మల్ని చూడకపోయినా చరిత్రకే చెమటలు పట్టించిన మీ చరిత్ర చెబుతుంది మీ గురించి, మీ ఆశయాలు ఎప్పటికి మా గుండెల్లో పదిలంగా ఉంటాయి అని తెలిపారు. కంటితో నిన్ను చూడలేకపోయిన, మా గుండెల్లో నింపిన ఆశయం మా కడ శ్వాస వరకు బ్రతికే ఉంటుంది మున్నూరు కాపు కుటుంబ సభ్యులు, సంఘ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జూలూరుపాడు మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, గ్రామ పెద్దలు రోకటి సురేష్, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గుమ్మడి వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, యాసం కృష్ణయ్య, చౌడం పెద్ద కృష్ణయ్య, అప్పికట్ల ప్రసాద్, రాయి విష్ణుమూర్తి, తోట రామకృష్ణ, రోకటి లక్ష్మీ నరసింహారావు(బాబు), రోకటి శ్రీను,అరిగేలా నరసింహారావు, దేవరపల్లి రమేష్ , పాలెపు నరసింహారావు, ముల్లపాటి అప్పారావు, చౌడం శ్రీనివాసరావు,మున్నూరు కాపు వంగవీటి మోహనరంగా యూత్ పాపినేని మధు, యసం నాగరాజు, ఊడల దినేష్, చౌడం అశోక్, రామిశెట్టి వంశీ , ఉర్లమెట్ల నవీన్, పాలెపు వెంకటేశ్వర్లు, గడల మనోజ్, శెట్టి వెంకటేష్, రాయి నవీన్, చౌడం కృష్ణయ్య, పురేటి శ్రీను,
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు తాళ్లూరి వీరయ్య, చౌడం నరేందర్, ముళ్ళపాటి దుర్గయ్య, భూక్య రాంబాబు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు