డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మంచి రుచికరమైన, శుభ్రత కూడిన నాణ్యమైన భోజన పదార్థాలను ప్రజలకు అందించి మంచిగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రుచి బావర్చి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండలం లాల్ పహాడ్ చౌరస్తాలో గారెల రాజు, అశోక్, ప్రవీన్ ల రుచి బావర్చి రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రుచి బావర్చి రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి మనిషికి జీవితంలో ముఖ్య భాగం అయిన ఆహార పదార్థాల విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండాలని, వ్యాపారంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ ఉంచుతూ, కల్తీ పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన శ్రేష్టమైన నాణ్యమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని యజమానులకు సూచించారు.
హోటల్ వ్యాపారము ప్రజల ఆరోగ్యానికి ముడిపడి ఉన్నది కాబట్టి స్వచ్ఛమైన భోజన పదార్థాలను భోజన ప్రియులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మ కొందుర్గు మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, మాజీ సర్పంచులు బాబు రావు, మల్లేష్, గౌస్, గోపాల్, మాజీ ఎంపిటిసి ప్రమోద్ రావు, బండి రాజు, చేగూర్ పీఎసీఎస్ చైర్మన్ అశోక్, చేగూర్ మాజీ పీఎసీఎస్ విట్టల్, బిఆర్ఎఎస్ నాయకులు మహాదేవ్ పూర్ రవిందర్ రెడ్డి, జంగిలి కుమార్, క్రిష్ణ, బిఆర్ఎస్ యువ నాయకులు దినేష్ సాగర్, రాజు, మధు, రామచంద్రయ్య, ధీమ గణేష్, నరేష్, సత్యం ముదిరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.