| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ 4000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలి : వెంగళ శ్రీనివాస్

పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ  4000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలి  : వెంగళ శ్రీనివాస్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి 

బి ఆర్ టి యు  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ 

 డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్  జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ అని అన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమపై  8 లక్షల మంది బీడీ  కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. బీడీలు చుడితేనే పూట గడిచే పరిస్థితి ఉంటుందని ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఈ పరిశ్రమపై పెద్ద ఎత్తున మహిళలు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ఈ పరిశ్రమను కాపాడాల్సిన   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్వీర్యం చేసే పద్ధతుల్లో అనేక ఆంక్షలు విధిస్తూ బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని దేశంలో ఎక్కడలేని విధంగా 2016 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకున్న ఘనత కేసిఆర్ గారిదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీడీ కార్మికులకు 4000 రూపాయల  జీవనభృతి పెంచి ఇచ్చి  ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరము దాటిన ఈ హామీని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని ఈ బీడీ పరిశ్రమను కాపాడి  ఎలాంటి ఆంక్షలు  లేకుండా పిఎఫ్ కలిగిన కార్మికులందరికీ 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వాలని జీవిత బీమా మరియు ఈఎస్ఐ  సౌకర్యం కల్పించి  ఆర్థికంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు.

Previous బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next రుచి బావర్చి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT