డైలీ భారత్, హైదరాబాద్: బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకుల లకావత్ గిరిబాబు సంతాపం తెలిపారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని ఆయన పేర్కొన్నారు.
మొగిలయ్యి కుటుంబ సభ్యులకు లకావత్ గిరిబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.