| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భవిష్యత్ రాజకీయాలు యువతతోనే :మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

భవిష్యత్ రాజకీయాలు యువతతోనే :మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: దళితులకు అసైన్డ్, సీలింగ్ భూములు ఇచ్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.

ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా క్యారగారి శ్రీధర్ ఎన్నికయ్యారు. 

ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కేఎల్ఆర్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి సన్మానించారు.

భవిష్యత్ రాజకీయాల్లో యువరక్తం నింపేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కిచ్చెన్న తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలకు లక్ష్మారెడ్డి సూచించారు.

అన్ని వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రాజకీయ అవకాశాలు, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక సమానత్వం, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే అన్నారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు కేఎల్ఆర్.

పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా భావించి యూత్ కాంగ్రెస్ బలోపేతం చేస్తామని నూతన ఎస్సీ సెల్ అధ్యక్షులు క్యారగారి శ్రీధర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరుణ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు సుభన్ యాదవ్, కొంతం సందీప్, మహేశ్వరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లూరు రాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Previous శాసనమండలిలో తన గళం విప్పిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
Next ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
ADVERTISEMENT