డైలీ భారత్, నంద్యాల: నంద్యాల పట్టణంలోని టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు నందు సోమవారం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకార జిల్లా అధికారులు వెంకటసుబ్బయ్య, వెంకటకృష్ణయ్యలు హాజరయ్యారు. ప్రధానంగా భారత దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సాధించేందుకు సహకారం సంఘాల పాత్ర అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని కో ఆపరేటివ్ అధికారులు పేర్కొన్నారు. అనంతరం శిల్పా ముహిళా సహకార్ బ్యాంక్ ద్వారా మహిళలకు రుణాలను చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా శిల్పా ముహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ...2010వ సంవత్సరం నంద్యాల పట్టణంలో పూజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ స్థాపించబడి నిరంతరంగా నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా వేదింటి మహిళల ఆర్థిక మహిళా సహకార్ బ్యాంక్ నందు 13వేల మంది మహిళలు ఖాతాదారులుగా ఉన్నారని, వీరికి ఇప్పటికి 22 కోట్ల రుణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా భలోవేతం కావాలని, అలాగే చదుపు కోవాలని అపుడే సమాజం, దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తన మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి చెప్పిన విధంగా నేటికి వారి ఆశయాలకు అనుగుణంగా, సూర్తిగా తీసుకొని మహిళలకు రుణాలను అందజేస్తున్నామన్నారు. అలాగే రుణాలను అందించడమే కాకుండా ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరో మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ అందించి వారికళ్లపై వారు నిలబడి, వారి పిల్లలను, కుటుంబానికి చేదోడుగా నిలబెట్టడం గర్వంగా ఉందన్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినా వాటిని లెక్కచేయక పేదల కోసం కష్టనష్టాలకు ఓర్చి శిల్పామహిళా సహకార బ్యాంక్ను కొన సాగిస్తున్నామన్నారు. కో ఆపరేటివ్ అధికారులు మాట్లాడుతూ... నవంబర్ నెల 14వ తేది నుండి 20వ తేది వరకు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాటి మాజీ ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో భాగంగా కో ఆపరేటివ్ సొసైటీల అభివృద్ధికి కృషిచేశారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఈనెల 14వ తేది నుండి వారోత్సవాలను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల అభివృద్ధి, విజయగాథలు, భవిషత్తు ప్రణాళికలు తదితర అంశాలపై చర్చించడం ఉంటుందన్నారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ అందరి ఆశిస్సులతో అనేక సంవత్సరాలు ముందుకు సాగాలని ఆ సంఘం చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో. శిల్ప మహిళా సంఘం డైరెక్టర్ పూర్ణిమ, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హరిలీల, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.