డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఉన్న జాకీ షో రూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధి మదిన సర్కిల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది..
సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటన స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..