| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ.. ప్రజల కోసమా! దొరల కోసమా? యువ న్యాయవాది సిరిగిరి శ్రీకాంత్

తెలంగాణ.. ప్రజల కోసమా! దొరల కోసమా? యువ న్యాయవాది సిరిగిరి శ్రీకాంత్

యువ న్యాయవాది సిరిగిరి శ్రీకాంత్ నిలదీత

ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్లో చేరిన శ్రీకాంత్

తెలంగాణ తెచ్చుకుంది.. ప్రజల కోసమా!.. దొరల కోసమా?. అని యువ న్యాయవాది సిరిగిరి శ్రీకాంత్  ప్రభుత్వాన్ని నిలదీశారు.

డైలీ భరత్, వేములవాడ:  శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో సిరిగిరి శ్రీకాంత్  100 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు ఇచ్చారా ? లేక భూమి పంచారా ? ఎందుకు  ఓటేయాలని ప్రశ్నించారు.

 బడ్జెట్ తాకట్టు పెట్టి తెచ్చిన రూ.5 లక్షల కోట్ల అప్పుతో ప్రజలకు చేసేందేమి లేదని.. ప్రజల సంపదను ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని, నిరుద్యోగులకు నియామకాలను చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బలహీన వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరినవారు

బీమా మహేష్, న్యాత మహేష్, పిట్టల చంద్రశేఖర్, దారస్రావన్, రొండి అజయ్, కనగర్తి పరుశురాం, పిట్టల అనిల్, కౌశిక్, పిట్టల నరసయ్య లతో పాటు 90 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

Previous మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు
Next పాతబస్తీలోని జాకీ షో రూంలో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT